Header Banner

అమరావతి టెండర్ల ప్రక్రియ ప్రారంభం.. కానీ అసలు ప్లాన్ ఏంటో తెలుసా?

  Sun Mar 09, 2025 16:05        Politics

కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది, అమరావతి రాజధాని నిర్మాణాలను తిరిగి ప్రారంభించాలని తలపెట్టింది. గతంలో ఆపివేసిన నిర్మాణాలు మళ్లీ చురుకుగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం ముహూర్తాన్ని ఖరారు చేసింది. ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసుకుంది. దీంతో, అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరగడానికి మార్గం సుగమమైంది. ఈ క్రమంలో, నిర్మాణాల పనులను కొనసాగించేందుకు సీఆర్‌డీఏ టెండర్ల ప్రక్రియను ప్రారంభించింది. నిధుల సమీకరణలో ప్రభుత్వం ముందడుగు వేసి, నిర్మాణ పనులకు మరింత వేగం పెంచాలని నిర్ణయించింది.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

అమరావతిలో నిర్మాణాలు మరింత ఊపందుకోవడానికి కూటమి ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ వారంలోనే రూ.40 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంది. ఈ నెల 12 నుండి 15 మధ్యలో వివిధ నిర్మాణాలను కార్యరూపంలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులకు నిధులను సమకూర్చేందుకు ప్రపంచ బ్యాంకుతో పాటు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB), హడ్కో వంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. దశల వారీగా అమరావతి అభివృద్ధి కోసం రూ.31 వేల కోట్లు రానున్నాయి. టెండర్ల ప్రక్రియ కూడా గత జనవరిలోనే ప్రారంభమైనప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొంత ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ తొలగిన వెంటనే, టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసి, కాంట్రాక్టర్లను ఖరారు చేసింది.

 

అమరావతి నిర్మాణాల్లో భాగంగా ఇప్పటివరకు నిర్ణయించిన భవనాల రూపాల్లో మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు. తాజా ప్రణాళిక ప్రకారం, మొత్తం 90 పనులను ప్రారంభించనున్నారు, వీటిలో 73 పనులకు రూ.48,000 కోట్ల పరిపాలనా అనుమతి లభించింది. మరో 62 పనులకు రూ.40,000 కోట్లతో టెండర్లు పిలిచారు. ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఏజెన్సీలను ఖరారు చేశారు. అయితే, కొన్ని పనులకు బిడ్లు దాఖలవకపోవడం గమనార్హం. ముఖ్యంగా, ఎన్జీఓ, ప్రభుత్వ అధికారుల క్వార్టర్ల నిర్మాణాలకు టెండర్లకు స్పందన లేకపోవడంతో, అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా 8 పనుల టెండర్లు తెరిచారు.

 

రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం టెండర్ల గడువు మార్చి 5తో ముగిసింది. బంగ్లాల నిర్మాణానికి సంబంధించి మరో రెండు పనుల టెండర్ల గడువు మార్చి 7న ముగిసింది. సాంకేతిక బిడ్ల పరిశీలన కొనసాగుతుండగా, ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మొత్తం మీద, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. మూడు సంవత్సరాల కాల పరిమితిలో నిర్మాణాలను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ప్రభుత్వ కీలక అప్‌డేట్.. ఏపీలో కొత్తగా మరో ఎయిర్‌పోర్టు.. ఆ ప్రాంతంలోనే! 80 కిలోమీటర్ల దూరంలో..

 

ఏపీలో మరో కొత్త జిల్లా ఏర్పాటు.. అక్కడే..! హామీ ఇచ్చిన విధంగానే.. పండగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

ఎమ్మెల్సీ ఫలితాలతో వైసీపీ నేతల్లో వణుకు! కూట్ర విఫలం.. వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది!

 

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #Amaravati #APPolitics #TeluguNews #BreakingNews #LatestNews